బరువు తగ్గి..స్లిమ్ గా తయారవ్వడానికి కుకుంబర్ లెమన్ జ్యూస్

కుంకుంబర్ (కీరదోసకాయ)మోస్ట్ పాపులర్ నెగటివ్ క్యాలరీ ఫుడ్ . ఇందులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి . పొటాషియం ఎక్కువ మరియు 95శాతం నీరు కలిగి ఉంటుంది. కీరదోసకాయను తినడం మరియు కీరదోసకాయ జ్యూస్ తాగడం వల్ల ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు. అంతే కాదు కీరదోసకాయకు నిమ్మరసం జోడించి తీసుకోవడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా బరువు తగ్గించుకోవచ్చు.


కీరదోస మరియు నిమ్మరసం కాంబినేషన్ డ్రింక్ శరీరానికి డిటాక్సిఫై చేయడంతో పాటు , బరువు తగ్గించుకోవడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ మార్గం. ఈ నేచురల్ డ్రింక్ ను తయారుచేయడానికి మూడు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. వాటిలో కీరదోస, లెమన్, మరియు మింట్ . కీరదోసకాయ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు అద్భుతమైన డ్యూరియాటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. అదే విధంగా నిమ్మరసం అసిడిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల ఇది జీర్ణ శక్తిని పెంచుతుంది. మరియు ఫ్యాట్ బర్నింగ్ కాంపోనెంట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఇక పుదీన అద్భుత ఔషధాలు కలిగినది . అనేక న్యూట్రీషియన్స్ గలది మరియు ఇది స్టొమక్ యాసిడ్స్ ను నివారిస్తుంది.

ఈ మూడు రకాల కాంబినేషన్ పదార్థాలు జీర్ణక్రియను పెంచడంలో గొప్పగా సహాయపడుతాయి . వీటిని కలిపినప్పుడు , వండర్ ఫుల్ టమ్మీ ఫ్లాటనింగ్ డ్రింక్ గా పనిచేస్తుంది. పొట్టదగ్గర చేరిన అనవసర వ్యర్థాలను తొలగించడంలో ఈ డ్రింక్ గ్రేట్ గా పనిచేస్తుంది.

కావల్సినవి:

కీరదోసకాయ: 1/2
నిమ్మకాయ: 1
పుదీనా ఆకులు 10
నీరు: 1లీటర్


తయారుచేయు విధానం:


కీరదోసకాయను , పుదీనా ఆకులను కొద్దిగా నీరు చేర్చి మెత్తగా పేస్ట్ చేయాలి. తర్వాత ఈ పేస్ట్ ను ఒక లీటర్ నీటిలో మిక్స్ చేసి ఫ్రెష్ లెమన్ జ్యూస్ ను అందులో జోడించాలి . తర్వాత మీకు ఇష్టమైతే కొన్ని ఐస్ ముక్కలు జోడించి చల్లచల్లగా లాంగించేయాలి. ఈ జ్యూస్ ను రెగ్యులర్ గా తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది .

రిమార్క్ లేకుండా క్రమంగా బరువు తగ్గుతారు. మంచి మార్పు కనిపిస్తుంది . ఈ హెల్తీ హ్యాబిట్ ను మీ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందడంతో పాటు, స్లిమ్ గా తయారవుతారు.

ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ జ్యూస్


1)  బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ జ్యూస్ -  కీరదోస జ్యూస్ లో సోడియం ఎక్కువగా ఉండదు. ఇది నేచురల్ డ్యూరియాటిక్ డ్రింక్ . ఈ కాంబినేషన్ డ్రింక్ వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు ఫ్లష్ అవుట్ చేస్తాయి . శరీరలో టాక్సిన్స్ తో పాటు ఫ్యాట్ సెల్ కూడా బయటకు ఫ్లష్ చేయడం వల్ల పొట్ట బాగంలో నీరు తగ్గుతుంది దాంతో కడుపు దగ్గడర వాపు తగ్గుతుంది. ఫ్యాట్ కరుగుతుంది.

2)  మెటబాలిజం రేటు పెరుగుతుంది -  కుకుంబర్ జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది . దాంతో తిన్న ఆహారం త్వరగా..తేలికగా జీర్ణమవుతుంది. దాంతో విటమిన్స్, మినిరల్స్ శరీరంలోనికి బాగా షోపింప బడి, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది.

3) ఉదయం పరగడపున తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది - కుకుంబర్ జ్యూస్ లో ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు . కాబట్టి ఎలాంటి బయాలు లేకుండా నిరభ్యంతరంగా తాగవచ్చు. దీన్ని ఉదయం పరగడపున తాగడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పొట్టను కిగిస్తుంది.

4) రిఫ్రెష్ గా ఫీలవుతారు -  ఈ కాంబినేషన్ జ్యూస్ తాగడం వల్ల రిఫ్రెష్ గా ఫీలవుతారు. అంతే కాదు ఫ్యాట్ ఫుడ్స్ మీద కోరిక కలగదు . దాంతో శరీంరలో కొవ్వు కణాలు కరిగడానికి సహాయపడుతుంది.

5 ) బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ జ్యూస్ -  ఇది కేవలం వెయిట్ లాస్ డ్రింక్ మాత్రమే కాదు, స్కిన్ గ్లోయింగ్ టానిక్ కూడా...

6) బరువు తగ్గించే కుకుంబర్ లెమన్ -  జ్యూస్ కొన్ని రకాల వ్యాధులను నివారించడానికి అవసరం అయ్యే లక్షణాలు కీరదోసకాయ వాటర్ లో పుష్కలంగా ఉన్నాయి. ఇంకా ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరంను డిటాక్సిఫై చేస్తుంది.
















No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.