జుట్టు పెరగడానికి కొబ్బరి నూనె-నిమ్మరసం ఉపయోగించే మార్గాలు

ప్రస్తుత కాలంలో అందం విషయంలో ఏమాత్రం రాజీ పడరు. ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు.అందమైన చర్మ సౌందర్యంతో పాటు, అందమైన,ఆరోగ్యకరమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు?జుట్టు అందాన్ని , ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చేయని ప్రయత్నాలంటూ ఉండవు. హెయిర్ కు సెరమ్, ఆయిల్స్, షాంపులు వంటి కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం, వల్ల ఇవి కెమికల్స్ తో తయారుచేయబడి ఉంటాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి. 


ఆరోగ్యకరమైన , అందమైన జుట్టు పొందడానికి ఏం చేయాలి? కొబ్బరి నూనె, నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. కొబ్బరి నూనె జుట్టుకు అవసరమయ్యే తేమను, పోషణనను అందిస్తుంది, ఈ రెండింటి కాంబినేషన్ ను రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వీటి కాంబినేసన్ నూనెలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి, ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరుగుదలకు చాలా ఉపయోగపడుతాయి. నిమ్మరసంలో సిట్రస్ యాసిడ్స్ ఉండటం వల్ల దీన్ని వివిధ బ్యూటిఉత్పత్తుల్లో ఉపయోగిస్తున్నారు. ఇందులో విటమిన్ సి అధికగా ఉండటం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

నిమ్మరసం చుండ్రును నివారిస్తుంది, ఎక్సెస్ ఆయిల్ తగ్గిస్తుంది, తలలో జిడ్డు పోగొడుతుంది. జుట్టుకు కాంతివంతంగా మార్చుతుంది. జుట్టు సమస్యలను నివారించుకొని, జుట్టుకు మంచి పోషణ అందివ్వడానికి కొబ్బరినూనె మరియు నిమ్మరసం ఉపయోగించే మార్గాలు ఈ క్రింది విధంగా..

జుట్టు పెరుగుదలకు లెమన్ -కోకనట్ ఆయిల్ రెమెడీస్..

1)  షాంపుతో ఉపయోగించాలి : ప్రతి ఒక్కరి జుట్టు సమస్యలకు నిమ్మరసం అప్లై చేయడం సురక్షితం కాదు. నిమ్మరసంలో అసిడిక్ ఎక్కువగా ఉండటం వల్ల తలలో దురద, చీకాకు కలిగిస్తుంది. కాబట్టి, షాంపుతో ఉపయోగించడం మంచిది. నిమ్మరసంను షాంపుతో మిక్స్ చేసి తలకు అప్లై చేసి, తలస్నానం చేసుకోవాలి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టుకు కాంతివంతంగా చేస్తుంది.

2)  కొబ్బరి నూనె: కొబ్బరి నూనెకు కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయడం వల్ల చుండ్రు నివారించబడుతుంది. తలకు మంచి పోషణ అందుతుంది. నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ , యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వల్ల చుండ్రును ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. కొబ్బరి నూనె తలకు పోషణను ఇస్తుంది. కొద్దిగా నిమ్మరసంను కొబ్బరి నూనెలో మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి. ఒక గంట తర్వాత మైల్డ్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

3)  తలస్నానానికి: నిమ్మరసాన్ని నేచురల్ గా తలస్నానానికి ఉపయోగించుకోవచ్చు. ఇది జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది, . రెండు మూడు నిమ్మపండ్ల రసాన్ని తీసి, మీరు తలస్నానానికి ఉపయోగించే నీటిలో మిక్స్ చేసి, ఆనీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తర్వాత కూడా ఈ నీటిని తలారాపోసుకోవాలి. తిరిగి మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

4) బాదం ఆయిల్ : డ్యామేజ్ హెయిర్ ను రిపేర్ చేయాలంటే బాదం నూనెలో కొద్ది నిమ్మరసం మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. అరగంట తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

5) పెరుగుతో: నిమ్మరసం చుండ్రునివారించడంలో నేచురల్ రెమెడీస్ గా పనిచేస్తుంది, దీన్ని పెరుగులో మిక్స్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.కొద్దిగా ప్లెయిన్ పెరుగు తీసుకుని అందులో ఒకచెంచా నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చుండ్రును తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. పెరుగు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

6) వేపఆకులతో: వేపాలకు పేస్ట్ చేసి, నిమ్మరసం మిక్స్ చేసి తలకు అప్లై చేయడంవల్ల తలలో ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు నివారించబడుతాయి.ఈ పేస్ట్ అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. దీన్ని వారంలో రెండు సార్లు అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది.








No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.