మంగళవారం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు

మంగళ వారం కుజునికి సంకేతం . కుజుడు ధరిత్రి పుత్రుడు. కుజగ్రహం భూమి పరిమాణం కన్నా దాదాపు సగం చిన్నదిగా ఉంటుంది. భూమిపై నివసించే వారికి కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 


కుజుడు కలహాలకు, ప్రమాదాలకు, నష్టాలకు కారకుడు. కనుకే కుజగ్రహ ప్రభావం ఉండే మంగళవారంనానడు శుభకార్యాలను సాధారణంగా తలపెట్టరు. వీటితో పాటు మరికొన్ని పనులు చేయకూడదు. అవేంటో తెలుసుకోవాలంటే ఈక్రింది స్లైడ్ క్లిక్ చేయండి...

మంగళవారం ఏ పనులు చేయాలి? ఏ పనులు చేయకూడదు :


1) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? మంగళవారం రోజున గోళ్ళు కత్తిరించడం, క్షవరం మొదలైన పనులు చేయకూడదు.

2) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? మంగళవారం నాడు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. అప్పు తీసుకున్నట్లైతే అది అనేక బాధలకు కారణమై తీరకుండా మిగిలే ప్రమాదం ఉంది.

3) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? మంగళవారం దైవ కార్యాలకూ, విద్యా, వైద్య పరమైన బుణాలకు ఇది వర్తించదు.

 4) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? మంగళవారం రోజును చాలా మంది కొత్త బట్టలు వేసుకోరు. వేసుకోరాదు కూడా.

5) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? అలాగే మంగళవారం తలంటు స్నానం చేయడం శుభకరం కాదంటారు .

6) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? ముఖ్యమైన ప్రయాణాలు చేయవల్సి వస్తే భగవంతుని ధ్యానించి తర్వాత ప్రయాణం సాగించాలి.

7) మంగళవారం ఏ పనులు చేయకూడదు.? మంగళవారం ఉపవాసం చేసే వారు రాత్రి పూట ఉప్పు వేసిన పదార్థాలు తినరాదు.

8) మంగళవారం చేయదగిన పనులు: మంగళవారం ఆంజనేయున్ని ధ్యానించడం వల్ల ధైర్యం చేకూరుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వల్ల కుజగ్రహ ప్రభావం కారణంగా కలిగే అనేక ప్రమాదాలను నివారించుకోవచ్చు.

9) మంగళవారం చేయదగిన పనులు: మంగళవారం కాళికాదేవిని ధ్యానించడం వల్ల శత్రువులపై జయం కలుగుతుంది.

10)  మంగళవారం చేయదగిన పనులు: కుజునికి ప్రీతిపాత్రమైన ఎరుపు రంగు దుస్తులు ధరించడం, ఎరుపు రంగు పువ్వులతో ఇష్టదైవాన్ని పూజించడం వల్ల మంచి జరుగుతుంది. జాతకంలో కుజగ్రహం వక్ర ద్రుష్టితో చూస్తున్నట్లైతే ఎరుపు వస్త్రాలు ధరించరాదు.

11) మంగళవారం చేయదగిన పనులు: హనుమంతుడిని సిందూరంతో పూజించడం వల్ల లేదా సుబ్రమణ్య స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయడం వల్ల దోష ప్రభావం తగ్గుతుంది.













No comments:

Post a Comment

Note: only a member of this blog may post a comment.